పుట:Andhraveerulupar025958mbp.pdf/83

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

హములు ప్రత్యేకదర్శనీయములు. ఆలయాభిముఖముగ నున్న నంది చూచి యానందింపదగినది. ఇంక నాకాలమున రుద్రువిభుని త్యాగాధారమున బ్రతిష్టింపబడిన యపూర్వ శిల్పదేవాలయములు కలవుగాని వాని వర్ణనమిచట గావించుట ప్రకృతము కాదు. రెండవ ప్రతాపరుద్రుని కాలమున యవనులు గావించిన దండయాత్రలో నీ యాలయము రూపుమాపబడెను. హతశేషమగు నాలయభాగము,రుద్రదేవుని విజయకథల దెలుపుశాసనము, కోనేరు నేటికిని దర్శనయోగ్యములుగ నున్నవి. రుద్రదేవుడు నగరము చుట్టు పెద్దమట్టికోట గట్టించి యన్నివైపుల గట్ట నాధారపఱచి తటాకముల బ్రతిష్టించెను. సేనానాయకులుగూడ బెక్కుతటాకముల ద్రవ్వించి రాజ్యమంతయు సుభిక్షము గావించిరి. ఆంధ్రసామ్రాజ్యమున నా కాలమున క్షేత్రములు సస్యసంపూర్ణములై మనోహరముగా నొప్పుచుండెను.

రుద్రదేవుడు శైవమునం దభిమాన బావము గలవాడు. అట్లుండియు నా కాలమున మిగుల వ్యాప్తముగానున్న జైనమతమునెడనెట్టి విద్రోహమును గావించి యెఱుంగడు. తన యాస్థానమునందు వీరశైవ, జైన, అద్వైత, విశిష్టాద్వైత పండితులకు సమగౌరవము లొనరించెను. పలుమారు తులాభారముల దూగి సువర్ణము విద్వాంసులకు బంచియొసంగెను. అనుమకొండ సామ్రాజ్య నగరముగా నుండుటకు