పుట:Andhraveerulupar025958mbp.pdf/78

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

మగు నాలయము మండపము గట్టించెను. ఇంతియగాక మొగిలిచర్లయనుచోట నేకవీరాదేవి యను శక్తిని బ్రతిష్టించి గొప్ప దేవళము గట్టించి వస్తువాహనములు సమర్పించి మరల రాజధానిచేరి తనపేర, దనతండ్రిపేర బెక్కుగ్రామములు గట్టించి యాగ్రామములు వేదవేదాంగ ప్రవీణులగు బ్రాహ్మణోత్తములకు ధారవోసి యంతతో దృప్తినొందక దిగ్విజయపరుడై వివిధరాజుల వశంవదుల గావించుచు శ్రీశైలఫ్రాంతము తన హస్తగతము గావించుకొని యట బత్నీయుక్తుడై రత్నమాషణములు మడిమామాన్యములు సమర్పించి పాండ్యాధీశ్వరులపై దండయాత్రవెడలి కాంచీనగరము శ్రీరంగములోనగుపుణ్యక్షేత్రములు దర్శించి పాండ్యుల సామంత రాజులను గాలించి సేతుబంధన రామేశ్వరునియొద్ద కేగి తులాభారములు పెక్కు తూగి ధనుష్కోటిలో స్నానాదికముల గావించి జయములనెలకొల్పి రుద్రదేవచక్రవర్తి జయలక్ష్మీ ద్వితీయ రాజధానికి జేరెను. మఱియొకమాఱు వారణాసీప్రాంతాలకు దండయాత్రకు వెడలి గంగాస్నానములు గావించి శోడ శోపచారములతో విశ్వేశ్వరునకు బూజాదికములు గావించి యనంతరము గయకేగి పితృదేవతలకు బిండప్రదానము సభక్తికముగ నిర్వహించి యిప్పటికి బాపవిముక్తుడ నైతినని రుద్రదేవచక్రవర్తి రాజధానినగర మగు ననుమకొండకు జేరెను.