పుట:Andhraveerulupar025958mbp.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పితృహత్యాకర్తయగు నన్నతో గలిసిమెలసి యుండడయ్యెను. ప్రోలరాజు కాలములో సామంతులుగనుండి పన్నులు చెల్లించిచుచు విధేయులై యున్నవారిలో బలువురు తిరుగబడి స్వతంత్ర పతాకముల నూపి యశాంతి సమీరము నతిశయింప జేయుచుండిరి. హృదయశల్యమువలె బితృహత్యా విచారము మనస్సును దీవ్రవేదనపాలు గావించుచుండెను. ముందు బితృహత్యాఘమునుండి విముక్తుడైన గాని తనజీవితము పవిత్రము గాదనియు, దా నపవిత్రుడై యున్నంతవఱకు బ్రజావిశ్వాస దూరుడు కావలసి వచ్చుననియు, నిశ్చయించి రుద్రదేవుడు రాజధానియగు అనుమకొండలో గొప్ప శివాలయము గట్టించి సహస్ర స్తంభమండపము దీర్పించి గొప్ప దీర్ఘికను ద్రవ్వించెను. ఒరంగల్లులో బెక్కుశివాలయముల బ్రతిష్ఠించెను. పూజారులచే బూజాపురస్కారముల నందికొనుసిద్ధేశ్వరునకు విశాలాక్షీ దేవికి నిత్యనైవేద్య దీపారాధనాదులకు గ్రొత్త వస్త్రములు నొసంగి బొక్కసములోని ధనముతో రాజథాని కాఱుక్రోసుల దూరములోనున్న అయ్యనవోలులోని విశాల ప్రదేశమున మైలారుదేవున కొకగొప్ప యాలయమును గట్టించి, ఒరంగల్లుకోటలో గల ద్వారములవంటి విచిత్రశిల్పాభిరామములగు ద్వారముల నాలుగువైపుల బ్రతిష్ఠించి అనుమ కొండకు బరుగుదూరములో నున్న వడ్డెపల్లిలో గొప్ప తటాకమును ద్రవ్వించి చెంత సిద్ధివిఘ్నేశ్వరుని బ్రతిష్ఠించి యచట విశాల