పుట:Andhraveerulupar025958mbp.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నెరవేరినది. ఖడ్గము నూడ బెఱకుము. బాధతో బ్రాణముల భరించుట చాలకష్టముగ నున్నది. సహగమనమునకు మీతల్లి సిద్ధురాలయ్యెనేని వలయు నవకాశముల గల్పింపుము. నీ సోదరుడు మహాదేవ రాయల భారము నీతలపైననే గలదు. ఇవి పద్మాక్షీదేవి ప్రసాదించిన దివ్యాయుధములు. మన పూర్వులు యాయుధముల దాల్చి విక్రమైకజీవనులై యుభయ లోకములలో బేరుగాంచిరి. పరిజనులారా! పౌరులారా! మీయందరి యొద్ద సెలవునొందుచున్నాడనని ప్రోలరాజు పంచాక్షరీ జపము చేయుచు గనులు మూసికొనెను. రుద్రదేవు డపనతముఖుండై పితృదత్తములగు నాయుధము లందుకొని తండ్రియురమున గాటముగ నాటుకొనిన ఖడ్గము నూడబెఱికెను. చిమ్మనగ్రోవితో గొట్టినటుల రక్తధారలు రుద్రదేవుని మెయినిండ బడెను. ముఖ్యులగు నమాత్యు లాయదనున రుద్రదేవుని నటనుండి తొలంగించి ప్రోలరాజు కళేబరమున కర్హమగు సంస్కారముల గావించిరి. రాజపత్నియు గుమారుని కౌగిలించుకొని యానందబాష్పములతో నాతని మేను దడిపి భర్తృచితిపై వ్రాలి వీరస్వర్గ రాజ్యమును జూరగొని జ్వాలా గర్భమున నందర్హిత యయ్యెను.

ఒక శుభముహూర్తమున రుద్రదేవ చక్రవర్తి యాంధ్ర సాంరాజ్యమునకు బట్టాభిషిక్తు డయ్యెను. దేశము మిక్కిలి సంకులస్థితిలో నుండెను. తన సహోదరుడగు మహాదేవరాయ