పుట:Andhraveerulupar025958mbp.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వెడలుటయే కష్టముగానున్న యా మరణావస్థలో తెఱప జేసికొని తీవ్రవాదులగు నారాజభక్తుల నందఱవారించి "మిత్రులారా! శాంతివహింపుడు. హంతకుడు స్వామిద్రోహికాడు. నాకుమారుడె. అతడు రుద్రదేవుడు. భవిష్యదాంధ్రసామ్రాజ్యచక్రవర్తి. ఇతని జననకాలముననె జ్యోతిష్కులు జాతకములవ్రాసి పితృమారకుడగునని సెలవిచ్చిరి. విపత్తునుండి బయటపడనెంచి వీని నాలయమున రహస్యముగజేర్చి యర్చకుల యాధీనమునం దుంచితిని. నేటితో నాకాయువు పరిపక్వమైనది. ఇప్పటికి నాకు డెబ్బదిరెండు వత్సరములు వచ్చినవి. భోగములపై విరక్తికలిగినది. మన:పూర్వకముగ నాబాలుండాంధ్ర సామ్రాజ్యమునకు భారవాహకు డగుటకు నేను సమ్మతించు చున్నాడను. మీరందఱు నాపై జూపిన గౌరవ మీ బాలకునిపై జూపుట కర్తవ్య"మని ప్రోలరాజు పల్కి స్తబ్ధుడై చూడసాగెను.

ప్రజలందఱు భయవిస్మయములచే దరంగితులై చిత్ర ప్రతిమలవలె నిలుచుండి యాదృశ్యమును దిలకించుచుండిరి. అనుకొనిన దొకటి అయిన దొకటి. రుద్రదేవుడా ప్రోలరాజు వాకములు వినిన సదాది "రాజద్రోహినేకాక పితృద్రోహినిగూడనైతినా ఈ పాపమున కిక శిక్షలేదు. నాయంతపాపి భూలోకమున లేడని తండ్రిపై వ్రాలి విలపించెను. ప్రోలరాజు తనయుని గాఢముగ కౌగిలించుకొని "కుమారా! విచారింపకుము. దె వనిది