పుట:Andhraveerulupar025958mbp.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నెక్కించి రాజధానిలో బ్రతిష్టింపనెంచెనుగాని యెంతప్రయత్నించినను ఎద్దు లాశకటమును లాగజాలవయ్యెను. చెంత నున్న బండ్ల విప్పించి కాండ్లుకట్టి తోలినను యెద్దులు మోర బిగించి ముందడుగు వేసి పోవ నెంత ప్రయత్నించినను బండి కదలకపోయెను. అది దైవమహత్త్వముగ భావించి దైవస్వరూపులు, మహానుభావులు, సర్వజ్ఞశిరోమణులు, కాళేశ్వర నివాసులు నగు రామారణ్య శ్రీపాదులను, త్రికూట నివాసులు, హిడింబాశ్రమ నివాసులు నగు త్రిదండమహామునుల రావించి వారి కీవిషయము ప్రోలరాజు విన్నవించెను. వారలు పూర్వోత్తర కథనంతయు నాలకించి యాసువర్ణలింగమునకు నత్యంత భయభక్తులతో నభిషేకము చేయించి విభూతి శ్రీచందన మలంది వేదోక్తముగ సహస్రనామపూఝ గావించి బిల్వపత్రముల బైనిగప్పి మహానైవేద్యమును సమర్పించి 'హరహరా!' యని యెద్దులను దోలుమనిరి. శకటము తేలికగా నడువ సాగెను. ప్రజ లామహాత్ముల శక్తికి విస్మయమునొందిరి.

రాజ్యాంగరహస్యవేత్తయు, పరబ్రహ్మస్వరూపుడు, విజ్ఞానరాశియగు రామారణ్యశ్రీపాదులు ప్రోలరాజుతో 'ఇది సామాన్య సువర్ణలింగము కాదు. స్పర్శవేదలింగము. దీనిని సోకినచో నినుము బంగారమగును. నూతనముగ నాలయముగో పురము గట్టించి యందు దీనిని బ్రతిష్ఠింపవలయునని యాత తీయ సమ్మతించెను. రామారణ్యశ్రీపాదులు శ్రీవిద్యాధర