పుట:Andhraveerulupar025958mbp.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రుద్రదేవ చక్రవర్తి.

ఆంధ్రరాజన్యులలో గాకతీయులు మిగుల సుప్రసిద్ధులు. "కాకతి" యను పదము దేవికి బర్యాయనామము. ఈవంశీయులు పూర్వము కాకతి దేవతకు భక్తులైయుంటచే వీరలను నాటనుండి కాకతీయులని వ్యవహరించు చున్నారు. "కాకతి" జైన దేవతనియు నీవంశీయులలో బూర్వులు జైనులుగనుండి యా దేవతను బూజించుచు నుండుటచే గాకతీయులుగ వ్యవహరింపబడిరని తెలియుచున్నది. కాకతీయులలో బూర్వుడు మహామండలేశ్వర బేతరాజు.

త్రిభువన మల్ల విక్రమాదిత్యుడను చాళుక్యరాజన్యు డాంధ్రకర్ణాట దేశంబుల బాలించుచు బలువురను బ్రతినిధులుగ ముఖ్యనగరములయం దుంచి వారలచే రాజ్యము నేలించి సుంకముల బడయుచు యాజమాన్యము దనయం దుంచు కొనెను. ఆకాలమున రాజప్రతినిధులుగ నున్నవారిలో గాకతీయవంశీయులుగూడ జేరియుండిరి. కాకతీయులు మొట్టమొదట జాళుక్యులయొద్ద సామంతరాజులుగ రాజప్రతినిధులుగనుండి పరాక్రమముచే బలుకువాసిచే బలము నభివృద్ధి గావించికొని, లోకువగనున్న సామంతుల గొల్లగొని, రాజ విప్లవములలో విజృంభించి సమీపదేశము నాక్రమించు