పుట:Andhraveerulupar025958mbp.pdf/63

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ఘటించినచో బరువుదక్కుట దుస్తరమని తనకుమార్తె నాతని కొసంగి పరిణయముగావించి రాజ్యములో గొంతభాగము నరణముగా నిచ్చెను. విజయలక్ష్మితో నర్థాంగలక్ష్మితో విజయసింహుడు తననగరముజేరి విజయాదిత్యుడను కుమారుని గాంచెను. ఈనృపాలుడు క్రీ.శ. 450 ప్రాంతమున నుండి యుండునని చరిత్రమువలన దెలియుచున్నది. ద్రవిడాంధ్ర కర్ణాటమహారాష్ట్ర దేశములు చిరకాలము పరిపాలించి ధర్మసంస్థాపనము గావించిన లోకోత్తరకీర్తిధుర్యులగు చాళుక్యులలో విజయసింహుడు ప్రథమగణ్యుడు. ఈయన సంపూర్ణ జీవితము నెఱుంగదగు నాధారము లింతవఱకు వలసినన్ని లభింపనందున విస్తరించి తెలుప వీలుకాదయ్యెను. అసహాయ స్థితియందుండి స్వశక్తిచే లోకోత్తర ఖ్యాతినొందిన విజయసింహుని కార్యదీక్ష కార్యశూరులగు నాంధ్రసోదరులకు మార్గదర్శక మగుగాక!