పుట:Andhraveerulupar025958mbp.pdf/62

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

లేకుండ జేసి శత్రుజనభీకరుండై రాజ్యము నేలు సమయమున విజయసింహు డాతనిపైకి దండయాత్రకు వెడలెను. ఉభయ సైన్యములకు జిరకాలము భయంకర సంగ్రామము జరిగెను. దురదృష్ట వంతుడగు ఇంద్రవర్మబలము సన్నగిల్లెను. చేయునది లేక యపజయము నిశ్చయమని తెలిసికొని విజయసింహుని శరణు వేడగా శరణాగతత్రాణ బిరుదాంకుండగు నారాజన్యుడు అపరాధముగా గొంతధన మాతని నుండి కైకొని సామంతుడుగ నేర్పాటు చేసెను. పల్లవులపై సహజ ద్వేషభావముగల యీ రాజతిలకుడు చిక్కినపల్లవరాజును జిక్కినటుల బంధించి తండ్రినాటి పగను వడ్డితో గూడ దీర్చికొని దక్షిణాపథమున నింతటి రాజు లేడను ప్రతిష్ఠ వహించెను.

విజయసింహుడు విజయయాత్ర ముగించి యగ్రహారమునకు జేరి తన విజయకథలు తండ్రితో సమానుడగు విష్ణువర్ధన భట్టారకునకు దల్లికి నివేదించెను. తరువాత నొకశుభ ముహూర్తమున చాళుక్యసామ్రాజ్యమును వాతాపియను నగరమునందు స్థాపించి ప్రాక్పశ్చిమ చాళుక్య వంశముల రెంటికిని మూలపురుషు డయ్యెను. కాంచీ నగరమునందు బల్లవరాజ్య మొకటి యాకాలమునందు సుప్రసిద్ధము గానున్న వార్తవిని విజయసింహు డపరిమిత బలసమేతుడై దండయాత్రకు బయలువెడలెను. పల్లవరా జీవర్తమానమువిని ప్రతి