పుట:Andhraveerulupar025958mbp.pdf/61

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

మాయెను. కొంతసేపటికి శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమై వరాహధ్వజము నొసంగి యీ ధ్వజసహాయమున విరోధిరాజుల జయించి పేరుగాంచగలవని యాశీర్వదించి యదృశ్యమయ్యెను. విజయసింహ బిరుదాంకుడగు విష్ణువర్ధనుడు గృహముచేరి బ్రాహ్మణోత్తమునకును దన తల్లికిని దానొందినవరములను దెలిపెను. విష్ణువర్ధన భట్టారకుడు మిగుల సంతోషించి విజయసింహునకు దిగ్విజయయాత్ర గావింప నొక శుభముహూర్తము నిశ్చయించెను. తల్లి బాలునకు వీరవేషమువేసి యాశీర్వదించి పంపెను.

విజయసింహుడు దైవబలముతో జైత్రయాత్రకు బయలుదేరు చున్నాడని విని రాష్ట్రకూటులయెడలను బల్లవుల యెడలను ద్వేషభావము గల పౌరు లనేకులు జయసింహునకు ధన సహాయము గావించిరి. తన తండ్రినాటి భటులలో బలువురు తమకు దామ వచ్చి జయసింహుని గలిసికొనిరి. అపరిమిత బలముతో బయలు దేరిన విజయసింహుని ధాటికి రాజు లెవ్వరు నాగజాలక పోయిరి. ఆకాలమున బ్రసిద్ధులుగా నున్న కదంబరాజులు, గాంగరాజులు కొంతవఱ కెదిరించి పరాజయశరణ్యులై యంకితులైరి. రాష్ట్రకూటులలో గృష్ణుడను రాజాకాలమున బ్రసిద్ధుడుగా నుండి విస్తార విశాలమైన దేశమును బాలించుచుండెను. అతని కుమారుడు ఇంద్రవర్మ. తండ్రిని మించి తనరాజ్యమున విరోధియను వాడు