పుట:Andhraveerulupar025958mbp.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నేని ధన్యుడను. నాతండ్రినిజంపిన పల్లవుల మారణముగావించుటయు నచిరకాలమున మహాసామ్రాజ్యము స్థాపించి మాకుటుంబమునెడ ననురాగముజూపిన ధన్యుల గౌరవించుటయు నాకర్తవ్యము. నేనిక నాజ్ఞపుచ్చుకొందు సెలవిం'డని పలికెను. బ్రాహ్మణుడు బాలుని పుత్రప్రేమతో బెంచిన వాడగుటచే నెడబాటునకు సహింపజాలక నేనును నీవెంట వచ్చి నీకనుకూలమగు పరిచర్యగావింతుననెను. రాజపత్నియు గుమారుని విడుపజాలక తాను రానుద్దేశించెను. బాలు డెట్టకేలకు దండ్రివలె దన్నుబెంచు బ్రాహ్మణోత్తముని దల్లిని ఒప్పించి వారివలన దివ్యాశీర్వాదములను బడసి తపశ్శక్తిచే గాని విజయము లభింపజాలదని మహారణ్యములకు బోయెను. రాజకుమారునకు బయలుదేరినదిమొద లనేక శుభశకునములయ్యెను. అన్నియు దన భావ్యాభివృద్ది సూచకములుగా దలంచి దేవతానిలయమనియు జాళుక్యులతపో భూమియనియు బేరొందిన చాళుక్యపర్వతమున కేగి రాజకుమారుడు చిరకాలము తపస్సుచేసెను. సప్తమాతృకలతో గుమారస్వామి యాబాలునకు బ్రత్యక్షమై "నీవెచటికేగినను సింహమువలె విజయము గడింతువు గాన విజయసింహనామము ధరించుమనియు, దిరుగ మీవంశము నిలుచుటకు విష్ణువర్ధన భట్టారకుడె కారకుడుగాన వంశీయులందఱు నామాంతమున విష్ణువర్ధనపదము జేర్చుకొను డని చెప్పి యాశీర్వదించి యంతర్ధాన