పుట:Andhraveerulupar025958mbp.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చెను. సమస్తవిద్యలయందును నాబాలుడు ప్రవేశముగలవాడై సర్వశాస్త్రప్రారంగతుడై యొకానొక దినమున దనతల్లియొద్ద కేగి "మనలను క్షత్రియులని లోకులు చెప్పుకొనుచున్నారు. మనము బ్రాహ్మణ గృహములో జిరకాలమునుండి యుండుటకు గారణమేమి? నాతండ్రి యెవరు? నేనేశాఖకు జెందినవాడనో యాజ్ఞయి"మ్మని యడిగెను. కుమారుని మాటలు విన్నంతన పట్టరాని దు:ఖమున రాజపత్ని పరితపించి కుమారున కేమియు బదులు చెప్పజాలకపోయెను.

విష్ణువర్ధన భట్టారకుడు విచారపరవశురాలై యున్న రాజపత్నిని జూచి "చింతల గారణమేమి? నావలన నేమేని ప్రమాదము జరుగలేదుగదా? గడుసరియై నీకుమారు డేమేని నొవ్వనాడెనా? తెలుపు"మని పలువిధముల నడిగెను. విచారాతిశయమున రాజపత్ని బదులాడజాలకపోయెను. విష్ణువర్ధనుడు బ్రాహ్మణోత్తమునకు నమస్కరించి తానే తల్లి విచారపడుటకు గారకుడనియు దనకులశీలాదికముల బ్రశ్నించుటచే నిటుల బలవించుచున్నదనియు నివేదించెను. విష్ణువర్ధన భట్టారకుడు బాలునిజేరజేరి గతవృత్తాంతము, తల్లి యచటికివచ్చిన హేతువు, తానామెను తనను సాదరమున బోషించుచున్నవిషయము నివేదించెను. రాజకుమారుడు కనుల నెఱుపెక్క 'బ్రహ్మజ్ఞ శిరోమణీ! తెలియక ముందు నీసొమ్ముదింటిని. నీకు ఋణపడి యున్నాను. ఈజన్మమున నీఋణము తీర్చుగొన గలుగుదు