పుట:Andhraveerulupar025958mbp.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేసెను. ఉత్తముడగు రాజును సృజింపవలయునను నాందోళనములోనుండి బ్రహ్మ అర్ఘ్యమిడుటకై జలము పైకెత్తగా నతని చులుకము (పుడిసిలి) నుండి తేజస్సంపన్నుడు వీరవతంసుడునగు నొకమహాపురుషు డుద్భవమయ్యెను. ఆవీరుడు బ్రష్మనుజూచి 'నన్నేల సృజించినాడవు? నాకర్తవ్యమేది?యని యడుగగా 'నీవు చులుకమునందు జనించితివిగావున చాళుక్యుడవు. ధర్మము దప్పనీయక ప్రజల బాలించి యుత్తమక్షత్రియవంశమునకు గర్తవుగ'మ్మని యాశీర్వదించి వానిని భూలోకమునకు బంపెను. తరువాత చాళుక్యుడు తపస్సంపదచే గొప్పశక్తిగడించి రాజ్యము స్థాపించెను. ఈయన రాజధాని యయోధ్య. ఈయనవంశము మిగుల బ్రసిద్ధులగు హరితుడు, మానవ్యుడు అను నిద్దరు వీరులు జనించిరి. తరువాత నీవంశీయులలో గొందరు దక్షిణాపథమునకు వచ్చి స్వతంత్ర రాజ్యములు స్థాపించి యార్షమతము నుద్ధరించిరి. ఈ చాళుక్యులను మానవ్యసగోత్రులని వ్యవహరించుచున్నారు.

దక్షిణాపథమున బ్రసిద్ధుడై యున్న విజయాదిత్యుడను చాళుక్యరాజు అపరిమిత సైనికబలముతో దండయాత్రకు బయలువెడలి త్రిలోచనపల్లవుడను సుప్రసిద్ధనృపాలుని రాజ్యమును హరింపనెంచి చిరకాలము యుద్ధముగావించెను. పరాక్రమశాలియగు త్రిలోచనపల్లవుడు ఆకాలమున బ్రసిద్ధులగు పల్లవరాజులను సహాయముగా దీసికొని విజయాదిత్యు