పుట:Andhraveerulupar025958mbp.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విష్ణువర్ధనుడు.

ఆంధ్రవీరులలో జాళుక్యులు మిగుల బ్రసిద్ధులు. వీరల నామము దేశచరిత్రములయందు జిరకాలమునుండి వినబడుచున్నది. మనచరిత్రకారులు విషయసుబోధనమునకు గాను రాజమహేంద్రవరప్రాంతము పాలించినవారిని దూర్పుచాళుక్యులనియు నిజాంరాష్ట్రమునందలి కుంతలదేశమును పాలించినవారిని బశ్చిమచాళుక్యులనియు బేరిడిరి. మనమిపుడు చదువబోవు ప్రసిద్ధపురుషుడును వీరోత్తంసుడునగు విష్ణువర్ధనమహారాజీ యుభయవంశజులకు మూలపురుషుడు. చాళుక్యరాజుల చరిత్రములలో నీయనఘుని జీవితచరిత్రము మేలుబంతిగా నున్నది.

చాళుక్యుల జన్మాదికములను గూర్చి యనేకకథలు గలవు. గ్రంథములందు శాసనములందును జాళుక్యులు చంద్రవంశ క్షత్రియులుగా జెప్పబడిరి. బ్రహ్మదేవు డొకనాడు పేరోలగమున నుండగా నచటకు సురపరివృతుడగు దేవేంద్రు డరుదెంచి యుచితసత్కారములొంది యాసనాసీనుడై 'వాణీ వల్లభా! కలియుగమాహాత్మ్యమునగ బోలు ధర్మము సన్నగిల్లినది. మనుజులు యజ్ఞయాగాదిక్రతువులు చేయుట లేదు. ప్రజలను ధర్మమార్గమున ద్రిప్పగల రాజును సృజింపు'మని వేడుకొనెను. బ్రహ్మ యందుల కంగీకరించి ఇంద్రుని బంపి