పుట:Andhraveerulupar025958mbp.pdf/54

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

వలన మాధవవర్మ యెంత న్యాయశీలుడో ధర్మస్వరూపుడో తెలిసికొనవచ్చును. మాధవవర్మ గతించి చిరకాలమైనను నాతని కీర్తినేటికి శాశ్వతముగ నున్నది. ఆంధ్రరత్నమగు నీరాజన్యుని చరిత్రము ప్రశంసాపాత్రము.

(కొందఱు మాధవవర్మ బల్లహుని వధించి యాతని తనయునకు రాజ్యమునొసంగెననియు సోమరాజు బల్లహునిచే వధింపబడెననియు జెప్పుచున్నారు. అంతకంటె యుక్తియుక్తముగ నుంటచే నీకథ నిట నుదహరించితిమి. వీరశిరోమణియగు మాధవవర్మ జీవితము మనకందఱకు బఠనీయమని యాంధ్ర సోదరులకు విన్నవించు చున్నారము.)

________