పుట:Andhraveerulupar025958mbp.pdf/53

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

మాతృసందేశమును లక్ష్యమునందుంచుకొని మాధవవర్మ యాంధ్రదేశమును జిరకాలము పరిపాలించెను. వీరచూడామణియగు నీమాధవవర్మ చరిత్రము చరిత్రాదులయందు శాసనాద్యాధారములచే నిరూపింప బడనంత మాత్రమున విశ్వసింపమనుట సాహసము. ఈతనిచరిత్రముకొఱకు నిజామురాష్ట్రమున మిగుల బరిశోధించుట యావశ్యకము. ఈరాజన్యుడు ధర్మబద్ధుడై చిరకాలము రాజ్యము పాలించి యనేక మహాకార్యముల గావించెను. క్రీస్తుశకము 200 ప్రాంతములో నీరాజ శిరోమణి యున్నటుల నూహింపవచ్చును.

మహామండలేశ్వరుడగు మాధవవర్మ చిరకాలము రాజ్యమేలి యాత్మానురూపులగు తనయులబడసెను. అందొక తనయుడు చింతగింజలమ్ముకొని జీవించు నొక పేదరాలి తనయుని ప్రమాదవశమున జంపెను. మాధవవర్మ యాయంశము మిగుల జాగరూకతగ విచారించి తనయుడు దోషియని తెలిసికొని పుత్రవాత్సల్యము దిగద్రావి యాతని కురిశిక్ష విధించెను. మల్లేశ్వరస్వామి మాధవవర్మ న్యాయబుద్ధి కానందించి మృతుడగు బీదబాలుని రాజపుత్రుని బ్రతికించుటయే గాక సువర్ణవర్షము సైతము కురిపించెను. ఈయంశము పండ్రెండవ శతాబ్దమున పల్లకేత భూపాలుండు బెజవాడ మల్లేశ్వరాలయములోని యొక శాసనములో వ్రాయించెను. దీని