పుట:Andhraveerulupar025958mbp.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దురంతముల స్మరించి విచారపడు నీదీనునికనికరించుట కర్తవ్యమని యొక్కపెట్టున వాపోయెను. సోమరాజు బల్లహుని గరుణించి, తనయునిగాంచి 'పుత్రకా! యీతనివలన నపరాధంబు గొని యంకితుని గావించుకొని క్షమింపు' మని తెలిపెను. మాధవవర్మ బల్లహునివలన బదుమూడుకోట్లు సువర్ణనాణకముల నపరాధముక్రింద గొని యాదాయములో నాఱవభాగము సుంకముగ బ్రతిసంవత్సరము నిచ్చునటుల నాజ్ఞాపించి విడచి పెట్టెను.

మాధవశర్మ రాజకుమారుని జూచి "కుమారా! కలియుగంబున క్షత్రియప్రసాదంబు స్వీకరించుట బ్రాహ్మణులకుం దగదు. బల్లహుని దురితశమనార్థమై మేము సిద్ధేశ్వరాలయమున సిరియాలదేవి యొసంగిన ప్రసాదము స్వీకరించితిమి. ఈ యనాచారదోషము శాంతినొందుటకై మేమందఱము దీర్ఘకాలము జపతపోనియమాదులచే గాలక్షేపము గావింపవలయును. గాన నాజ్ఞయి"మ్మని యడిగెను. బ్రాహ్మణోత్తముల పాదములను బంగరుపళ్లెరములో గడిగి మాధవవర్మ యందఱకు వారి యర్హతానుసారముగ గోదావరితీరముననున్న రెండువేల గ్రామముల నగ్రహారములుగ నొసంగి యమోఘములగు నాశీర్వాదముల నొందెను. చోళేశ్వరుడు మాధవవర్మ పరాక్రమాదికముల నాలకించి తన పుత్రికనొసంగి కొంతరాజ్యమును సమర్పించెను. పితృసందేశమును