పుట:Andhraveerulupar025958mbp.pdf/5

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక.

సహృదయులారా !

ఆంధ్రవీరు లను పేరుతో జరిత్రవిషయికమగు వీరకథలతో బ్రథమభాగము కొన్నిమాసముల క్రిందట బ్రచురించి యుంటిమి. విద్యభిమాను లాగ్రంథమును మిగుల నాదరించి సదభిప్రాయముల నొసంగిరి. భాషావిదులగు నుపాధ్యాయులు మాయుద్యమమునెడ నభిమానించి యున్నత తరగతులకు బఠనీయ గ్రంథముగా నేర్పఱచి మాకెంతయు దోడ్పడిరి. ప్రజాభిమానమును గుర్తించి యీరెండవ భాగమును గూడ నుత్సాహముతో బ్రచురింప గలిగితిమి.

సాధారణముగా జరిత్రగ్రంథములందు జిరకాలము విశాలరాజ్యమేలిన రాజుల చరిత్రములె విపులముగా గానవచ్చుచుండును. రాజుల చరిత్రముతో బాటు రాజ్యస్థాపకుల చరిత్రముగూడ మనకు బఠనీయముగాన నీరెండవభాగమున రాజ్యస్థాపకుల చరిత్రమునకె యుచితస్థాన మొసంగితిమి. ఆంధ్రరాజుల చరిత్రము చాలవఱ కగమ్యముగా నున్నది. పురాణగ్రంథములందలి యాంధ్రరాజ వంశములకు జరిత్రము లందలి యాంధ్రరాజులకు సంబంధములు కలుపబడుటకు దీవ్రయత్నములు జరుగుచున్నవి. ఆంధ్రవాజ్మయమునందును శాసనలిపియందును, పూర్వచరిత్రములందును అపూర్వాంశ