పుట:Andhraveerulupar025958mbp.pdf/48

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

లేక పౌరుషము దిగద్రావి బల్లహుడు మాధవవర్మను శరుణు గోరెను. తీవ్రక్రోధపీడితుడగు మాధవవర్మ యాతని బంధించి తాను సోమభూపాలుని తనయుడననియు సోమరాజును వంచించినందులకు బశుధనమును దొంగలించినందులకు, సిరియాలదేవిని బరాభవింప యత్నించినందులకు గందారరాజ్యమును హరించినందులకు నీవెట్టిశిక్షకేని యర్హుడవు. క్షమింప వీలులేదుఅనుచు కఠినముగ నివేదించి వీరులగు సేనానులను బిలిపించి బశుధనమునంతయు గోష్ఠములనుండి తొలగించి కందారమునకు జేర్పుడని యాజ్ఞాపించెను. బల్లహుని సైన్యమంతయు మాధవవర్మ హస్తగతమయ్యెను. దయాభూషణుడగు మాధవవర్మ బల్లహునిచే జెఱబెట్టబడిన రాజులనందఱ విడిపించి వారల నుచితగౌరవంబులతో గందార రాజ్యమునకు గొనిరండని కొందఱు ప్రధానులతో దెల్పి వలయు సైన్యమును సహాయముగ బంపెను. మాధవవర్మ విజయస్తంభమును గటకములో నెలకొల్పి నిజపురాభిముఖుడై బంధితుండగు బల్లహునితో దదితర రాజన్యులతో బయలుదేరి కొన్నాళ్లు శ్రమనివారణార్థము మధ్యమధ్య నివసించుచు మార్గ మధ్యముననున్న రాజులవలన భూస్వాములవలన గప్పముల బుచ్చుకొని వారల సామంతులుగ జేసికొనుచు బితృస్థలమగు కందారమునకు జేరెను. ప్రధానమాత్యు డంతకు మున్ను బంపినచారులవలన మాధవవర్మ కటకేశ్వరుని సంగ్రామ