పుట:Andhraveerulupar025958mbp.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాశుడగు మాధవవర్మను సందర్శించి యట నాసీనుడయ్యెను. వైదికాచార పరాయణుడగు మాధవశర్మ యెఱుకుదేవరాజు తన గృహమున కరుదెంచుట తలంచి కుమారునకైనను దనకైనను నింతయనరాని సేగిమూడి తీఱునని నిశ్చయించుకొని దైవసంకల్ప మమోఘము గనుక చేయునది లేదని యనుకొనెను. సిరియాలదేవియు బ్రాహ్మణియు గుమారునకు దైవమెట్టి యాపత్తుల గూర్ప సంకల్పించెనో పరిపరి విధముల విచారము నొందుచుండిరి.

ఎఱుకదేవరాజు దేవీదత్తఖడ్గఖేటకములతో బ్రకాశించు మాధవవర్మను సమీపించి పాదములపై సాష్టాంగ ప్రణామము నాచరించి చేతనున్న వజ్రహారము నాతని కంఠముననిడి "రాజపుత్రా! పెద్దవాడనైతిని. చిరకాలము రాజ్యము పరిపాలించి తనిసితిని. పుత్రపుత్రికా సంతానము లేమింజేసి యీరాజ్యము నెవరికి సమర్పింప వలయునాయని కలకాలము నుండి యోచించుచుంటిని. నాకాంక్ష ఫలించెను. అనుమకొండరాజ్యలక్ష్మి యిప్పటికి గృతకృత్యురా లయ్యెను. రాజ్యలక్ష్మి వెదకుకొనుచు నీసన్నిధికి జనుదెంచినది. అనుమకొండ రాజ్యమును వందనపూర్వకముగ నీకు సమర్పించుచున్నాడను. దయచేసి పరిగ్రహింపు'మని సహస్రభంగుల వేడుకొనెను. మాధవశర్మ యనుమతి ననుసరించి మాధవవర్మ యందుల కంగీకరించి యెఱుకురాజుతో శుభముహూ