పుట:Andhraveerulupar025958mbp.pdf/41

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

లేతెంచి 'నగర ద్వారమున మాధవవర్మయను రాజకుమారుడు బలములతో విడిసి యున్నాడు. నేల యీనినటుల జతురంగ బలములు కాన వచ్చుచున్నవి. ఏలిక కెఱిగింపవచ్చితి' మని విన్నవించిరి. ఎఱుకరా జున్నతమగు హర్మ్యము నెక్కి గవని యొద్దనున్న బలము నంతయు సందర్శించి దేవతావరప్రసాద విజయలక్ష్మీ పరిష్వంగు డగు మాధవవర్మకు విధేయుడై రాజ్యము నొప్పగింప కున్నచో నెంతటి రాజన్యు డేని మానుషము నిలుపుకొన జాలడని నిశ్చయించెను. గూడాచారులు సత్వరముగ నేతెంచి 'చతురంగ బలములతో ద్వారముచెంత విడిసిన మాధవవర్మ యను రాజపుత్రుండు భట్టాచార్యుం డగు మాధవశర్మగృహమున కేగెను. ఏలిక కెఱింగింప వచ్చితి' మని విన్నవించిరి. వెంటనే యెఱుకు దేవరాజు సర్వబలముల నాయిత పఱచి మంత్రి సామంతరాజ బంధు పరివృతుండై యుచిత వాహనంబు నెక్కి మాధవశర్మగృహమునకుం బయనం బయ్యెను. పౌరు లందఱు రాజన్యుని ప్రయాణమును గూర్చి పలువిధముల దమలో దాము తలపోయు చుండిరి.

భటులుచూపిన మార్గము ననుసరించి యెఱుకుదేవరాజు మాధవశర్మ గృహద్వారమున మదమాతంగమును డిగ్గి మంత్రి సామంతాదులతో గృహాంతరమున కేగి మాధవశర్మను, నాతని ధర్మపత్నిని, సిరియాలదేవిని, గోటిసూర్యప్ర