పుట:Andhraveerulupar025958mbp.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మంతయు వారికంధకారబంధురముగ శోకభూతమునకు నృత్యాగారముగ గానుపించెను. ఇంతలో మాధవవర్మ యటకు జనుదెంచి దేవీప్రదత్తములగు ఖడ్గఖేటకముల నొక వేదికపై నుంచి తల్లికి, మాధవశర్మకు, నాతని ధర్మపత్నికి నమస్కరించి రాత్రి తాను రాని కారణము తెలిపి పద్మాక్షీదేవి యనుగ్రహించిన యాయుధరాజముల వారికింజూపి గతరాత్రి కథాంశము లన్నియు బూసగ్రుచ్చినటుల వారికి విన్నవించెను. విద్యుద్వేగమున నీయంశమంతయు నగరము నలుగెలంకుల నెగబ్రాకెను. జనులంద ఱీ యంశము నాలకించి కుమారుని శక్తి సామర్థ్యములకు నచ్చెరువొందిరి. క్రమముగ నీవార్త హనుమకొండ రాజ్యము పరిపాలించు నెఱుకుదేవరాజుచెవి సోకెను. చిరకాలముక్రింద నాయన అనుమకొండకు సిరియాలదేవి యేతెంచి యాశ్రయము కోరుటయు బిమ్మట బల్లహుండు దండయాత్ర కరుదెంచి సిరియాలదేవిని వెదకించుటయు మాత్ర మెఱుగునుగాని పుత్రోత్పత్తియు నాపుత్రుని శక్తి సామర్థ్యము వినలేదు. కుమారుని యమోఘశక్తి సామర్థ్యములు వినగనే యెఱుకుదేవరాజు హృదయము సంచలించెను. అనుమకొండ రాజ్యమును బడయుటకై దేవిసన్నిదిని వరములు పొందివచ్చిన మాధవవర్మను శరణు గోరుటకంటె దనకు గత్యంతరము లేదని యాతడు నిశ్చయించికొని కర్తవ్యము నాలోచించు సమయమున నచ్చటికి జారు