పుట:Andhraveerulupar025958mbp.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నీ యధీనము గావించుచున్నాడను. ధనకనక వస్తువాహన విశేషంబుల యధావిధి వినియోగించి అనుమకొండలో సామ్రాజ్య మొండు స్థాపింప వలయు" నని యాతండు తెలిపి యంతర్హితుండయ్యెను.

మాధవవర్మ దైవదత్తమగు నీ బలముతో బయలువెడలినటుల బ్రతాపచరిత్రమున గలదు. ఇది యమానుషమని కొందఱు విశ్వసింపరేమో! ఎటులైననేమి పద్మాక్షీదేవి యనుగ్రహాతిశయమువలన మాధవవర్మకు జతురంగబలము లభించెను. వెంటనే మాధవవర్మ బయలుదేరి బలము లన్నింటిని హనుమకొండ గవనియొద్ద నుంచి వారి కాహారాదికములకు వలయు నేర్పాటులు గావించి తా నొక్కరుండ గృహమున కరిగెను.

కొమారుండు రాత్రినుండి కాన రాకుంటచే సిరియాల దేవి యేమియు దోచక విచారసాగరమున మునింగియుండెను. మాధవశర్మయు నాతనిధర్మపత్నియు నాయమకు హితము నెఱింగించుచు గుమారుం డచిరకాలంబున రా గలండని యోదార్చుచుండిరి. పెంచిన కారణంబున సిరియాల దేవికంటె వీరిరువురు లోలోన బరితాపమునొందుచు గుమారుడు రామికి హేతువు లనేకవిధముల నూహింపసాగిరి. ప్రత్యర్థు లెవరేని బాలుని గడతేర్చిరేమో యను భయ మా మువ్వురిహృదయముల గలచి వేయుచుండెను. ప్రపంచ