పుట:Andhraveerulupar025958mbp.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుము. అట నీకు జతురంగ సేనలు లభించును. వాని సహాయముతో ననాయాసముగ బ్రతిపక్షుల జయించి రాజ్యాభివృద్ధిగావించు కొనుము. సంపదలు హెచ్చినకొలది నడకుప వృద్ధిజేసికొనుము. ఔదార్యమును వ్రతముగ గ్రహింపుము. లక్ష్మీనారాయణ పూజయు నుమామహేశ్వర పూజయు గోబ్రాహ్మణభక్తియు నాచరణీయ ధర్మములు. పరదారాపేక్షయు, నసత్యసంభాషణము వర్జించి యెంతకాలము వర్తింతువో యంతవఱ కీదివ్యాయుధములు వాంఛితము లొసంగుచుండు"నని పద్మాక్షీదేవి యానతీయ వెంటనే మాధవవర్మ గుహలో బ్రవేశించెను. ప్రతిభావతి యగు పద్మాక్షీదేవి ప్రభావము వలన మాధవవర్మ కామార్గమంతయు గంటకమయముగ గంపించెను. దానిని బాటిచేయక సాహసముతో ముందడుగు వేసెను. భూతప్రేత పిశాచ శాకినీ డాకి న్యాదిగ్రహసము దాయము భయంకరముగ ముందు గనుపించెను. వ్యాఘ్ర సింహ మాతంగ సర్పాదులు మార్గమున నావరించి యున్నటుల బొడకట్టెను. గుహాంతరము మాఱు మ్రోగునటుల భయంకర ధ్వానములు సారెసారెకు వినబడెను. ప్రతిపదమున కేదియో భయంకరమగు విఘ్నము తోచెను. వీరచూడామణియు ధైర్యశాలియు నిశ్చలచిత్తుడు నగు మాధవవర్మ యంత రాయముల నించుకేని పాటి సేయక యొక జాముసే పాగుహాంతరాళమున బ్రయాణము చేసెను. మం