పుట:Andhraveerulupar025958mbp.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చుటవలనను రాజ్యము కటకేశ్వరుని యధీనమగుట వలనను మి గుల శ్రమలొంది దిక్కుచెడి వలసపోవుచుంటిమనియు, వర్షము వచ్చుటచే నిట విశ్రమించితిమనియు నివేదించిరి. మాధవవర్మ వారు తెలుపు నంశములకు మిగుల నానందించి తన వృత్తాంతము వారల కెఱింగించి వలసపోవ నవసరము లేదనియు స్వల్పకాలమున నేను రానుంటిననియు నంతదనుక మాతృభూమినెటులో కాపురము చేయుడని ప్రబోధించెను. నశించినదనుకొనిన రాజవంశము నిలిచినందులకు, రాజకుమారుని పరిపాలనమున దాము సుఖముల నొందగలిగినందుల కాపౌరు లానందించి బల్లహుని ధుష్టపరిపాలనమునుండి విముక్తియగు సుదినముకొఱకు సహస్రభంగుల దపము గావించుచు నావార్త సహచరులకు విన్నవింప నిజపురమున కేగిరి.

ప్రతాపచరిత్రమున నీయంశ మించుక మార్పుగ నీక్రింది విధముగా గలదు. పద్మాక్షీదేవి ఖడ్గఖేటకంబుల నొసంగి మాధవవర్మను సప్రేమంబుగ దిలకించి "కుమారా ఈయాయుధంబులు నీయొద్దనున్నచో బ్రత్యుర్థులు నిన్నెదిరింపజాలరు. ప్రతిసంగ్రామంబున నీదివ్యాయుధముల సహాయమువలన విజయము చేకూర గలదు. చెంత నీశైలమున నొక గుహ కలదు. అందు నీవు ధైర్యముగ బశ్చిమ దిక్కునకు బొమ్ము. మధ్య కలుగు విఘ్నముల నించు కేని పాటిచేయ