పుట:Andhraveerulupar025958mbp.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గర్భభారాలస యగు నాయమ మిగుల విచారము నొందుచున్నది. బ్రాహ్మణబృంద మంతయు నీఘోరకార్యమునకు చింతించుచు నెట్లు గుంపులుగ వచ్చు చుండెనో చూడుము. హృదయము లందఱకు రగులుకొనుచున్నవి. సాధుఘోష తగులక మానదు. దూరము యోచించి కీర్తి ప్రతిష్ఠల నిలువ బెట్టుకొని పాపాత్ము లగు భటుల దండించి నాపుత్రిక నొసంగుము లేదా మేమందఱము ప్రాయోపవేశము గావించి యిటనే సంఘమరణము నొందుదుము. భారతఖండమున నీ యపకీర్తి చిరస్థాయి కాగల దని మేఘ గంభీర స్వరముతో బలికెను. ఇంతలో భటులు సిరియాలదేవిని బల్లహుని చెంత నిల్పి ప్రతిచ్ఛందము నొసంగిరి. బల్లహుని కేమియు దోపదయ్యెను. బ్రాహ్మణుల కోపోక్తులు శ్రవణదారణములై చెలంగెను. సిరియాలదేవి శిరమువంచుకొని మొగమున గుడ్డ వైచుకొని విలపించెను. ఆసాధ్వీమణి పాపకర్ముడగు బల్లహుని కడకన్నులతోనైన జూడమానెను. బల్లహుడు ప్రతిచ్ఛందము లోని యాకృతితో సిరియాలదేవిని బోల్ప వీలుగాదయ్యెను. బ్రాహ్మణుల ఘోష మిన్ను ముట్టెను. యత్తరుడై కటకేశ్వరుడు నిలువబడెను.

సిరియాలదేవి మిక్కుటముగా విలపించు చుండెను. ఆయమ దీనవదనము బ్రాహ్మణోత్తముల పట్టుదలను మిగుల నభివృద్ధి పఱచెను. బల్లహుడు కొంచెము సే పాలోచించి