పుట:Andhraveerulupar025958mbp.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కంగీకరించెను. పరిచారకులు సిరియాలదేవికి జరిగిన వృత్తాంతము నంతయు నివేదించి యామెను బ్రాహ్మణవీధికి జేర్చిరి. గర్భభారమునను గమనాయాసమునను గృశించి నడువలేక నడువలేక నడచుచున్న యాసీమంతిని విప్రవాటికలో బ్రవేశించి బ్రాహ్మణోత్తముల నందఱ వేఱు వేఱు సందర్శించి తన దీనచరిత్రమునంతయు నివేదించి పరిచారకురాలిగనేని యుంచికొని పట్టెడన్నము బెట్టుడని సవిచారముగ బ్రార్థించెను. రాజువలన నెట్టి మాటవచ్చునో యని యెవరు నాయమ కాశ్రయము నొసంగరైరి. కడకు మాధవశర్మయను నొక బ్రాహ్మణుడు దయదలంచి యాయమను దన గృహమునజేర్చి గృహిణిచే నాయమ కాహారాదికముల గాలానుకూలముగ నొసంగ జేయుచు మిగుల ననురాగముతో భక్తివిశ్వాసములతో దానును విచారించుచుండెను.

సిరియాల దేవికష్టము లొంతతో నంతరింపలేదు. 'తగిలిన కాలే తగులును, నొగిలినకొంపయే నొగులు' నన్నటుల నాయమనాపదలు మఱల మఱల జుట్టుముట్టెను. కటకేశ్వరుడగు బల్లహుడు కందారరాజ్యము నాక్రమించి సోమరాజును తదకు అనుచరులను బంధించి యంత:పురము ప్రవేశించి రాజ్ఞికొఱకు వెదకెను. ఆయమ గర్భమందు దైవాంశసంభూతు డభివృద్ధి నొందుచున్నట్లును నాతడు తన కేనాటికైన మారకుండనియు వినియుంటచే గరవాలముతో నాగర్భము ఛేదింపనులకించి