పుట:Andhraveerulupar025958mbp.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యములు విజయనగరమును ముట్టడించి పాళ్లు పంచుకొన జూచిరిగాని కార్యకౌశలుడగు సీతారామరాజు ఆప్రయత్నములన్నియు విధ్వంసము గావించి ఆంగ్లేయసైనిక సహాయమున బ్రతిపక్షరాజుల రూపుమాపి వారి రాజ్యములను గైకొనెను.

సీతారామరాజు పేరునకు మంత్రిగా నున్నను తానే రాజుగా వ్యవహరించి పూర్వులొసంగిన మాన్యక్షేత్రములు అగ్రహారములు ఆక్రమించి రైతులకు గౌలున కొసంగుచుండెను. దానిచే బ్రజలకు గూడ నీతనిపయి మిగుల నసహ్యము జనించెను. ఈదోషములన్నియు బ్రజలు విజయరామరాజువిగా భావించి యాతనినిగూడ విద్వేషించిరి. సీతారామరాజు ప్రజాభిప్రాయములు పాటింపక తనయిచ్చచొప్పున జరించుచుండెను. ఈ నూతనపరిపాలనమునకు మిగుల విసికి అడిదము సూరకవి "రామలింగేశ శతకము"మున సీతారామరాజును మనసునందుంచుకొని ధుష్టరాజులను దూలనాడెను. ఎవరెన్నివిధముల నాందోళనము జరుపుచున్నను సీతారామరాజు పాటింపక తనయిచ్చ వచ్చినటుల వ్యవహరించు చుండెను. విజయరామరా జెటుల జెప్పిన నేమివచ్చునో యని తటస్థముగా నుండెను. ఈపరిస్థితులలో గాలము గడపుట ప్రజలకు సాటివారికి గష్టమయ్యెను. అందుచేత విజయనగర రాజ్యము నెటులేని కంపెనీవారికి గట్టిపెట్ట వలయునని సాటి