పుట:Andhraveerulupar025958mbp.pdf/175

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

శయించి కపటవినయము జూపుచుండిరని తలంచి తనయొద్ద గల జాబు వారికి జూపించెను. వారందఱు నాజాబు చూచి యది తాము వ్రాసినది కాదనియు మధ్యవర్తులు గావించిన మోసమనియు క్షమింపుడనియు బలువిధముల వేడికొనిరి. సోమనాద్రి విచారించి క్షత్రియ సోదరులు నిర్దోషులని గ్రహించి వారివలన గప్పములు గొని, సంగరములందు సహాయము జేయునటుల వాగ్దానము గైకొని గద్వాల కేగెను. ఈవార్త సయ్యదువిని సోమనాద్రివిజయమునకు జాలపరితపించి హైదరాబాదు నవాబునొద్దకేగి విలంబనము జేయవలదనియు దనపరాక్రమచిహ్నములగు, నగారా, ధ్వజము, ఏనుగు ఇప్పింపకున్న నాత్మహత్య గావించి కొందుననియు పట్టుబట్టెను. విధిలేక నిజాము ఆలీ సోమనాద్రిమీదికి సంగర సన్నద్ధుడై బయలుదేరెను. పూర్వపరాభవముతో నుడికి పోవుచున్న రాయచూరు పసరుజంగు పరిమితబలముతో నవాబునకు సహాయముగా వచ్చెను. -- ల్లారి బహదూర్‌ఖాన్, ప్రాగుటూరు ఇదురుసాహెబు, ఆదోనినవాబు, గుత్తిటీకు సులతాను, కర్నూలు దావతుఖాను లోనగు నవాబులందఱు నిజాము ఆలీకి సహాయమై సోమనాద్రిపైకి సైనికబలముతో దండయాత్రకు జనుదెంచిరి. మహమ్మదీయ సైన్యమంతయు లక్షల కొలదియై నేలయీనినటు లుండెను. కర్నూలు మొదలుకొని పదిమైళ్ళ దూరముననున్న ఉల్చాలవరకు బడమట, మూడు