పుట:Andhraveerulupar025958mbp.pdf/174

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

శయించెను. జాబుయొక్క పూర్వోత్తరములనేని విచారింపక సోమనాద్రి సంగరమున కాయితమై నగరరక్షణమునకు వలయుబలమునుంచి యొకశుభముహూర్తమున హర్పనహల్లికి బ్రయాణమయ్యెను. నిజాము ఆలి యీవార్తవిని సోమనాద్రి కంత్యదినములు సమీపించెనని యానందించి యావార్త సయ్యదుకు గూడ దెలిపెను. సోమనాద్రి హర్పనహల్లి కోటను ముట్టడించెను. ఈవార్త క్షత్రియసోదరులు విని 'సోమనాద్రి యెవరు? అతని పేరైన వినియెఱుంగమే! మనపైకి దాడి వెడలవలసిన యవసరమేమి వచ్చినది? ఈ విరోధమునకు గారణమేమైయుండును?' శత్రుజనాభేధ్యమగు మనకోటలో సురక్షితముగా మనముందము. అతడు జయించిన నాటికి జూచుకొంద' మని తలంచిరి. సోమనాద్రి ఆఱుమాసములు ముట్టడించి ఫిరంగులుప్రేల్చి యెంతప్రయత్నించినను హర్పనహల్లికోట చెక్కు చెదరకపోయెను. తరువాత సోమనాద్రి యుపాయాంతరములచే గోటబగులగొట్టి రాజసోదరులను బంధింపబోయెను. వారు సోమనాద్రిని జూచి యిటులనిరి. "రెడ్డివతంసా! ఏపాపము నెఱుంగని మమ్ము బంధించుట న్యాయముగాదు. మేము నిన్ను బ్రతిఘటింపక మాని కోటలోనే యుంటిమి. ఆ కారణముగ సాటివారిని శిక్షింప నెంచుట నీవంటి శూరవతంసునకు దగవుకాదు." క్షత్రియసోదరుల మాటలు వినినంతనే సోమనాద్రికి గోపమతి