పుట:Andhraveerulupar025958mbp.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దను సమీపించి గొల్లవాండ్రతో దనయవస్థయు వీరభటులు వెంబడించుటయు దెలిపి బ్రదికించిన గొప్పమేలు చేయుదునని బ్రతిమాలెను. వాండ్రు పెద్దగోయి తీసి అందు సోమనాద్రిని మెడవరకు బూడ్చి చుట్టును మేకపిల్లలనుంచి పైనిబుట్ట బోర్లించిరి. కొంతసేపటికి వీరభటులు వెదకుకొనుచు వచ్చి చుట్టుపట్టుగ్రామములు వెదకుచు గొఱ్ఱెలమందను గూడ బరిశీలించిరి. ఎందును సోమనాద్రి కనబడక పోవుటచే వీరభటులు విసిగి కృష్ణదాటి వెనుకకు వెళ్ళిపోయిరి. అనంతరము సోమనాద్రి బయటికివచ్చి గొల్లవాండ్రతో 'నాకు బ్రాణదానము గావించినందులకు మీరేమికోరుకొందురో తెలుపు' డనవారు నేటినుండి మీరు "ముష్టిపల్లి" యను మాగోత్రనామమును వహింపవలయునని కోరిరి. సోమనాద్రి యందులకంగీకరించి పూనూరునకు బోవుచుండ నొకచో భూగర్భమునందు బూర్వరాజులు నిక్షేపించిన ధనరాశి గోచరించెను. ఆధనము నంతయు బరిచారికులచే దెప్పించి పూనూరు సమీపమునందున్న యొక విశాలప్రదేశమున గోటకట్టింప నారంభించెను. ఆప్రదేశమునకు ఆమడదూరమునందున్న ఉప్పేడుకోటను బాలించు సయ్యదుదావూదుమియ్యాయను మహమ్మదీయుడు సోమనాద్రి కోటనుగట్టుచున్నసంగతి విని పరివారముతో నచటికి వచ్చి తనరాజ్యమున గోట గట్టవలదని నిర్బంధింపగా సోమనాద్రి పన్నుగట్టుచు సామంతుడుగా నుందునని యొప్పించి కోట