పుట:Andhraveerulupar025958mbp.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంతోషముతో సోమానాద్రిమాటలకు సంతోషపూర్వక మగు నంగీకారమును దెల్పిరి.

కేశవమ్మయు సోమనాద్రియు నొకబండి కట్టించుకొని మెదకు మండలమునకు బోవుచుండిరి. త్రోవలో వారికి పూనూరను గ్రామము తగిలెను. చరిత్రస్థలమును జిత్రదేవాలయావృతము నగు పూనూరులోనికి సోమనాద్రివెళ్ళి యంగడిలో దారిబత్తెమునకు వలయు వస్తువులుకొన్ని మూటగట్టుకొని పోవుచుండ గ్రామాధికారియగు నాగిరెడ్డి యాబాలకుని జూచి దగ్గరకు బిలిచి యతనివృత్తాంతము విచారించెను. బాలుడు తనసంగతి, కులము, స్థలము నివేదించెను. ధనవంతుడును సంతానహీనుడునగు నా పాశము నాగిరెడ్డి తానును బాకనాటిరెడ్డి యగుటచే నాబాలకుని పెంచుకొన్నచో గులము తరించుననితలంచి యూరి బయటనున్న బండియొద్దకు బాలునితో బోయి కేశవమ్మను జూచి పూర్వబాంధవ్యము తెలిపి సోమనాద్రిని దనకు బెంచుకొనుట కొసంగుమని ప్రార్థించెను. ఆయమ యందులకు నంగీకరించి బాలునితో దానుగూడ నాగిరెడ్డియింట వసించెను. కొంతకాలము నాగిరెడ్డి తా నార్జించిన ధనకనకవస్తు వాహనములు సోమనాద్రి కొసంగి చెప్పవలసిన ధర్మములన్నింటిని జెప్పి మరణించెను. సోమనాద్రి పితృకార్యము లన్నింటిని శ్రద్ధాభక్తులతో నిర్వహించి ప్రత్యేకరాజ్యము నొకదానిని స్థాపించినగాని సోద