పుట:Andhraveerulupar025958mbp.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వారును నటులనే చెప్పిరి. దావత్‌ఖాను వెంటనే కొఱ్ఱపోలూరునకు దండయాత్రకు బయలుదేరి తిమ్మారెడ్డిని బిలువనంపి చెట్టునకు గట్టించి దయాశూన్యుడై కొట్టించి యతనిధనము, పశువులు, ధాన్యములు కొనిపోయెను. దెబ్బలచే నొడలంతయువాచి తిమ్మారెడ్డి గతించెను. కేశవమ్మ, తనకుమారుడును ఏడెనిమిదేండ్లు నిండని కూనయగు సోమనాద్రిని వెంటబెట్టుకొని పుట్టినింటికి బోవుచుండెను. త్రోవలో రాజవోలనుగ్రామము గలదు. అచటగల కేశవాచార్యులను విద్వాంసుడు బాలురకు బాఠములు చెప్పుచు వీధిలో గూర్చుండి తల్లివెంట నేగుచున్న సోమనాద్రిని జూచి యీబాలుని ముఖమున మహారజుచిహ్నము లున్నవని గ్రహించి కేశవమ్మ వలన బాలకునిచరిత్రము నంతయు విని జాలిపడి యిటుల జెప్పెను. "అమ్మా! నీపుట్టినింటి గౌరవము, నీభర్తపేరుప్రతిష్ఠలు నేనెఱుంగనివి కావు. చెడి పుట్టినింటికి బోవుటకంటె బ్రమాద మింకొకటి యుండబోదు. కష్టములు కలకాల యుండబోవు. ఈబాలుడు లోకఖ్యాతి గడింపగల డని నాకు దోచుచున్నది. నాయొద్ద నుంచినచో నేను సమస్త శాస్త్రములు నేర్పెదను. నిన్ను, నీశిశువగు నీబాలకుని నేనున్నంతలో బోషింప గలుగుదును. ఇచటనే యుండుట నా కభిమతము." కేశవాచార్యులవాక్యములు వినినంతనే వివేకవతియగు కేశవమ్మ యచటనే నిలువ నంగీకరించి బాలుని