పుట:Andhraveerulupar025958mbp.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తానుగూడ నాకలిచే మలమలమాడుచు గూలినాలియైన చేసి జీవించుదమని మల్లారెడ్డి తన భార్యయగు కేశవమ్మను వెంటబెట్టుకొని బయలుదేరి కొల్లాపురము, పెంట్లవెల్లి, మూరవకొండ లోనగు గ్రామములకు బోవ నెందును గూలి దొఱకకపోయెను. కడకు కొఱ్ఱపోలూరను గ్రామమునకు బోయి యచట గూలినాలిచే జీవించుచుండెను. దొఱకిన కూలిధాన్యములో గొంచెము కొంచెము మిగిల్చికొని తిమ్మారెడ్డి కొంతధాన్యము సంపాదించి పాలికొక యెద్దును దీసికొని వ్యవసాయమును బెట్టెను. క్రమముగా గలసి వచ్చుటచే దిమ్మారెడ్డికొంతకాలమునకు గొప్ప రైతై ధనధాన్య సమృద్ధితో నుండెను. ఈశుభావసరమున వీరికొక కుమారుడు గలిగెను. సోమలింగేశ్వరుని యనుగ్రహమున జనించినవాడగుటచే నాబాలునకు సోమనాద్రియని నామకరణము గావించి సంతోషముగా గాలము గడుపుచుండిరి. వీరిశ్రేయముజూచి సహింపలేక గ్రామస్థులు కొందఱెటులేని యిబ్బంది పెట్టవలయునని తలంచి ఆప్రాంతములు పాలించు కర్నూలు నవాబగు దావత్‌ఖాను నొద్దకుబోయి తిమ్మారెడ్డి యను రైతు మీపై దిరుగుబాటు చేయుటకు బ్రయత్నించుచున్నాడు. వా డాయుధములు, ధనము, ధాన్యము సిద్ధము చేయుచున్నాడని విన్నవించిరి. నవాబు పలువురను బిలువనంపి యావార్త నిజమో కల్లయో దెలుపుమన వారంతకుమున్నే యీకుట్రలో జేరినవారగుటచే