పుట:Andhraveerulupar025958mbp.pdf/161

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

రమునందలి ధనము విరివిగా నుపయోగించి పారశీదేశమునుండియు అరబ్బీ దేశమునుండియు ఉత్తమాశ్వములను దెప్పించెను. బ్రతికిన గుఱ్ఱమునకైనను మార్గమధ్యమున జచ్చిన గుఱ్ఱమునకైనను మూడు గుఱ్ఱములకు వేయివరహాల చొప్పున ధనమొసంగి అశ్వముల నెన్నింటినో కొని ఆశ్వికదళము నభివృద్ధి గావించెను. చచ్చిన గుఱ్ఱములతోకల జూపినంత మాత్రముననే విలువయొసంగు చుండుటచె యవనవర్తకులు ధారాళముగా అశ్వవ్యాపారముగావించి విజయనగర రాజ్యమును అశ్వబృందములతో నించివేసిరి. నరసింహరాజు ఆశ్విక దళసహాయమున దనశక్తి సామర్థ్యములు పూర్తిగా నుపయోగించి అన్యాక్రాంతములైన రాజ్యముల నన్నింటిని దిరుగ సంపాదించెను. ఉదయగిరి, రాయచూరు, కొండవీడు దుర్గములు సాధించుకొనుటకుగూడ యత్నించెను గాని యంతలో నాతడు కాలధర్మము నొందెను.

సాళువ నరసింహరాజు ఆంధ్రవాజ్మయమున కెంతయు జేయూత నొసంగెను. పిల్లలమఱ్ఱి పినవీరభద్రుని సత్కరించి జైమిని భారతము నంకిత మొందెను. పలువురు కవు లీనరపాలుని గుణకీర్తనము గావించినటుల జాటువులవలన నెఱుంగ నగును. ఈయనయొద్ద మంత్రిగా నాదెండ్ల చిట్టిగంగనామాత్యు డను నియోగిబ్రాహ్మణుడుండెను. ఈయన విద్యానగరమును గృష్ణదేవరాయల కాలమునందు మంత్రిగానుండి