పుట:Andhraveerulupar025958mbp.pdf/155

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

     టరుదే సింగయ యన్నపోత విభుబాహా ఖడ్గనిర్మగ్నుడై
     యదివీరుండు గజంబునెక్కి సురరాజౌ టద్భుతంబెన్నగన్.

సీ|| అశ్వరేవంతుండు . హయమునునెక్కిన
            దండిరాజులగుండె . తల్లడిల్లు
    దరిని దద్భీకర . కరవాలహతికిని
            గర్ణాటసేనలు . కళవళించు
    సంగ్రామపార్ధుని . చాపటాంకృతులకు
            దెలుగురాజ్యంబెల్ల . దిగులుకొనును
    బ్రథన నిశ్శంకకు . బల్లెంబు డాకకు
            నుల్కుల్కు పడుచుందు . రొడ్డెరాజు

తే.గీ|| లతడు దరిమినచో నుండు . వితములేక
      సొరది సురధాని రాజులు . సొంపుదప్పి
      యోటమందిరి సిందూరి . కోటబయల
      సన్నుతఖ్యాతి యనపోత . మన్నెరాజు||

ఉ|| ఒక్కడు జారముఖ్యు డొకడూరకరోజు బరేతపాలకుం
    డొక్కడొకండు రాత్రిచరు డొక్కడు చాల జడుండు
    చంచలుం|డొక్కడొకండు యక్షఘనుడొక్కడు భిక్షుకు
    డేటి దిక్పతుల్|దిక్కుల నన్నపోత జగతీతల నాధుడుదక్క మేదినిన్||

(అనపోత భూపాలుడు క్రీస్తుశకము 1344 మొదలు 1380 వరకు రాచకొండ ముఖ్యపట్టణముగ నాంధ్రదేశము