పుట:Andhraveerulupar025958mbp.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లకు వచ్చినదెచాలునని మహమ్మదుషాహ సంతోషించి తన దుర్బలస్థితి దలంచుకొని గోలకొండ ప్రాంతముల నొసంగినచో వెనుక కేగెదనని వర్తమానమంపెను. కాల పరిస్థితులను గాడముగ యోజించి చేయునదిలేక కట్టకడ కనపోతభూపాలుడు కొంతద్రవ్యము, గోలకొండదుర్గము, దానికి సంబంధించిన గ్రామములు మహమ్మదుషాహ కొసంగ నంగీకరించెను. మధ్యవర్తులుచెప్పిన సరిహద్దులు వెంటనే యేర్పాటుచేసికొని సంధిరూపకముగ నొసంగిన యపరిమిత ధనమునుగొని గోలకొండరాజ్యముతొ దృప్తిపడి మహమ్మదుషాహ గృహముచేరెను. అనపోతనాయడు తన జీవితకాలములో నొందిన పరాజయ మిదియొకటియె యని చెప్పవచ్చును. అనపోతనాయకుని విక్రమజీవితము వెల్లడించు పద్యములు కొన్ని యాంధ్రజనులు పఠించుచున్నారు. చరిత్ర జిజ్ఞాసువుల యభిరుచి నుద్దేశించి యాపద్యములలో ముఖ్యములగువానిని గొన్నింటి నీక్రింద నుదాహరించి యీశూర వర్యుని విక్రమజీవిత గ్రంథము ముగించుచున్నారము.

ఉ|| ఆలములోన సింగవసుధాధిపనందను డన్నపోతభూ
    పాలకమౌళి కోడి యని బారిన వైరుల నాలభంగినే
    తోలునుగాని చంపడట దోసమటంచును నౌర రాయగో
    పాలున కుర్విలోన బశువర్గము గాచుట సాజమేకదా!

మ|| చిరకాలవ్రతశీలుడై నరుడు కాశీతీర్థ నిర్మగ్నుడై
     స్థిరలీలన్ వృషభంబునెక్కి రజతాద్రింజెంది ముక్కంటియౌ