పుట:Andhraveerulupar025958mbp.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వించుకొని యేకశిలానగరము ప్రవేశించెను. మహమ్మదీయ సైన్యము విజయసూచకముగా గోటలో గుడారములో విడిసియుండిరి. ప్రతిఘటించినచో విజయ మసాధ్యమని సంగర మర్మజ్ఞుడగు ననపోతనాయనికి స్ఫురించెను. అదిగాక రెడ్డివారితో జాలకాల మెడతెగకుండ బోరాడుటచే నాంధ్రసైన్యమంతయు భిన్నభిన్నమై యుండెను. మహమ్మదీయ బలమంతయు జెక్కుజెదరక కోటలో స్థిరవాసము నేర్పఱచుకొని యేకశిలానగర రాజ్యమును మ్రింగివేయవలయునని బయలుపందిరులు వేయుచుండెను. దైవముకూడ వారలపక్షముననె యున్నటుల ననపోతనాయని కశుభసూచనము లనేకములు గోచరించెను.

పుట్టినదాదిగ ననపోతరా జపజయము నొందినవాడు కాడు. ఆకాలమున గల యాంధ్రరాజన్యులలో నాతడె పైచేయిగ నుండెను. అనపోతనాయ డొకసేనానాయకుని కుమారు డను నంశము మాపాఠకులు మఱచియుండరు. తన బాహుబలము, శక్తిసామర్థ్యములు, బలసాహసములు వ్యయము గావించి యాతడు నిరాటంకముగ నాంధ్రదేశములోని చాలభాగమును తన ఛత్రచ్ఛాయక్రిందకు జేర్చికొనెను. మొక్కవోని పరాక్రమముగల యనపోతరాజన్యుడు తనదైన్యమునకు విచారించి కొందఱు రాయబారులను మహమ్మదుషాహయొద్దకు బంపెను. అనపోతనాయడు రాయబారము