పుట:Andhraveerulupar025958mbp.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జనేయ కాలభైరవాది వీరవిగ్రహములును వానిక్రింద ననపోతనాయకుని బిరుదములు సమగ్రముగ జిత్రింపబడి యున్నవి. కోటయొక్క యంతరాళమున రాచకొండ యనుగ్రామమును ధన్మధ్యమున రెండుకొండలు గలవు. అందొకటి రాచకొండనియు మఱియొకటి నాగనాయనికొండ యనియు బిలువబడుచున్నవి. రాచకొండ రాజువసించునది. ఇందు రాజనివాసోచితములగు చిహ్నము లనేకములు నేటికి గానవచ్చు చున్నవి. రాచకొండపై శిలామయములును శత్రుజనాభేధ్యములు నగు న్రాలుగుకోటలును నున్నతములగు బురుజులును దర్శనీయములై యలరారుచున్నవి. రెండవకొండయగు నాగనాయనికొండపై గూడ నొక దృడతరమగు దుర్గముకలదు. నాగనాయడను శూరవర్యు డాదుర్గమును నాశ్రయించి యుంటచే దానికాపేరు వచ్చెను. నాగనాయనిచరిత్రము ముందు బఠింప నవకాశము కలదు. అనపోతానాయని సోదరుడగు మాదనాయకుడు దేవరకొండయను దుర్గమున నుండి యగ్రజుని యాజ్ఞాను సారముగ రాజ్యము పాలించుచుండెను. ఈయుభయ దుర్గములు 30 మైళ్ళదూరములో నుండెను. ఆకాలమున నాంధ్రదేశములో ననపోతానాయకుని యంతటి బలవంతుడగు రాజులేడు. డిల్లీ పాలించు నవాబుతక్క ననపోతనాయని నెదుర్కొను రాజు మధ్యదేశమున లేడనుట సహజోక్తియే.