పుట:Andhraveerulupar025958mbp.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాయనిపుత్రులగు అనపోతనాయడు, మాదనాయడు తండ్రి వెంట నా సంగ్రామమునకు వచ్చియె యుండిరిగాన నావార్త వినగనే తండ్రిసమ్ముఖమునకు జేరిరి. సింగమనాయ డాయుదముతో మరణశయ్యయందుండియు గొంచెమేని విచారము నొందక దు:ఖమునొందు తనయుల నిర్వుర జేరజీరి బుజ్జగించి విచారముతో నిటులనెను. "కుమారులారా! ఈబాధతో నింక బ్రాణముల గొంచెముసేపేని నిలుపజాలను. బాకు పెకలించిన వెంటనే నాప్రాణముపోవ సిద్ధముగనున్నది. పరమునందేని నాయాత్మ శాంతినొందుటయే మీయభిప్రాయమైనచో, మీరు నిజమైన పుత్రులగుచో, రేచర్లగోత్రీయుల పరాక్రమరక్తము మీరక్తనాళములలో బ్రవహించు చున్నచో జల్లెపల్లి రాచవారొనరించిన దురాగతమునకు బ్రతిఫలముగ వారలరక్తముచే నాకు దిలతర్పణముల నొసంగ గోరెదను. మీరిరువురు తడవుసేయక యంగీకారము నెఱింగించి యాయుధోత్పాటనము గావింపుడు." సింగమనాయడు కన్నులు మూసికొనెను. భీమార్జునులకు దీసిపోని యాసోదర వీరు లిరువు రేకకంఠముగ 'మీయాజ్ఞనెఱవేర్చి పితృఋణము నుండి విముక్తలమయ్యెద' మనుచు జనకునిహృదయమున నాటికొనిన యాయుధము బెకలించిరి.

పితృమరణసందర్శనముచే బాలురగు ననపోత నాయనికి మాదానాయనికి బౌరుష మతిశయించెను. పితృవాక్య పరి