పుట:Andhraveerulupar025958mbp.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాచవారి వధించి యెటులేని చింతపల్లి సింగమనాయని బంధ విముక్తుని గావింపదలంచి తన సైనికబలము నంతయు వెంటగొని దాడివెడలెను. జల్లెపల్లి రాచవారు సింగమనాయని విజృంభణమునంతయు జూచి యపజయము తప్పదని నిశ్చయించుకొని వెఱవు వేఱుగానక దురాత్ముడు మాయాకుశలుడగు తమ్మళ దమ్మాజియను నొకవీరుని జల్లిపల్లి రాచవారు రాయబారమంపిరి. తమ్మళ దమ్మాజి తనరాకముందు రాజభటులచే సింగమనాయకున కెఱుంగజేసి యాతని సమ్ముఖమున కేగి చింతపల్లి సింగమనాయని యా క్షణముననె విడచిపెట్టుటయే గాక యపరాధముగూడ చెల్లింతుమనియు క్షమింపుమనియు వేడుకొనెను. సింగమనాయ డానందించి సైనికుల నందఱును రణోద్యోగము చాలింపు డని యాజ్ఞాపించెను. దమ్మాజి సింగమనాయనితో జాలసే పిష్టగోష్ఠిగ భాషించి భాషించి నమ్మిక పుట్టునటుల వర్తించి కాసెలోనున్న బాకుతో సింగమనాయని వక్ష:స్థలమున నిటునటు దిగునటుల గాఢముగ బొడిచి యావార్త బహిరంగము కాకముందె పాఱిపోయెను.

క్షణములో నీవార్త సైనికనివేశములో నల్లుకొనెను. వీరవర్యులు కొందఱు కోపమాపుకొనలేక దమ్మాజినిబట్టి తేవలయునని యున్నతాశ్వములనెక్కి బయలువెడలిరిగాని యాత డంతకంటె శీఘ్రముగ దుర్గముజేరెను. విచారకరమగు నీఘోరవార్తవిని సైనికులందఱు చాల విచారించిరి. సింగమ