పుట:Andhraveerulupar025958mbp.pdf/128

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

   లన్| దోచిన కంటకక్షతులు తోయజలోచన లాగ్రహంబుతో|
   జూచి నిజేశులందలిగి చూతురు పాయక చూతురుగ్రతన్||"

సింగమనాయడు త్యాగశీలుడు దేవబ్రాహ్మణభక్తి పరుడునై యనేక ధర్మకార్యములు గావించుటయే కాక యేలేశ్వరమున ననేక బ్రహ్మప్రతిష్టలు గావించినటుల సర్వజ్ఞ సింగమనేడు "రసార్ణవ సుధాకరము" లో జెప్పియున్నాడు. సింగమనాయ డప్రతీప ప్రతాపంబున నాంధ్రదేశములోని రాచకొండ దేవరకొండ దుర్గముల స్వాధీనము గావించుకొని యాంధ్రదేశము బాలించుతఱి నితర దుర్గపాలకులకు నితనికి నంత:కలహములు పెచ్చరిల్లెను. సామంతులుగ నున్న జల్లిపల్లి దుర్గపు రాచవారు పలుమారు ప్రతిఘటించి యపజయము గడించి శూన్యసంకల్పులైరి.

వీరవర్యులగు జల్లిపల్లిరాచవారు పలుమాఱు సింగమనాయనితో బ్రతిఘటించి నష్టపడియు నిరుత్సాహము నొందక యొకానొక సంగ్రామములో నాతని బావమఱదియగు చింతపల్లి సింగమనాయ డనువీరుని బట్టి తమకోటలోని కారాగారమున బంథించిరి. సింగమనాయ డది తెలిసికొని యావీరుని వదలి పెట్టుడని యనేక పర్యాయములు రాచవారికి వర్తమానము చేసెను. ఫలములేకపోయెను. సింగమనాయడు మిగులగోపించి జల్లెలల్లి దుర్గము నిర్మూలము గావించి