పుట:Andhraveerulupar025958mbp.pdf/127

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

అనపోతనాయకుని చరిత్రమును నరయుటకుముం దాతని జనకుడగు సింగమనాయనిచరిత్రము కొంతవఱకు దెలిసి కొనుట యావశ్యకము. సింగభూపాలుడు ప్రతాపరుద్రదేవుని యొద్ద సేనానాయకుడుగ నుండి మగతలయను గ్రామ సమీపమున భయంకరసంగ్రామ మొనరించి సామ్రాజ్యమునకు వ్యతిరేకించిన మచ్చకొమ్మనాయకుడను శూరుని వధించెను. జిలుగుపల్లి యొద్ద రుద్రనాయడను వీరుని ఘోరయుద్ధమున జయించి ప్రతాపరుద్రునిమన్ననకు బాత్రుడయ్యెను. ఇతడు మచ్చనాయకగండ, సామంతరాగోల యను బిరుదములనే కాక యెనుబది వరములనుసైతము ప్రతాపరుద్రుని వలన నొంది యసీతివరముల సింగమనాయడని విఖ్యాతి గాంచెను. ఆంధ్రకవు లనేకులు సింగమనాయని వీరజీవితము గానము గావించి కృతార్థులైరి. సింగమనాయనిచరిత్రము గ్రహింప నీక్రిందిపద్యములు సాయము కాగలవు.

"ఉ|| లాలితశౌర్యశక్తి నవలక్ష తెనుంగుదళంబు నాజిలో
     దోలిన పాండ్యభూవిభునితోడి పెసంకువ కోర్చి సన్నుతిన్
     వ్రాలి ప్రతాపరుద్రుసభ వర్ణనకెక్కిన యెఱ్ఱదాచ భూ
     పాలసుతుండు సింగని కభంగుని కేబిరుదైన జెల్లదే||

ఉ|| దాచయ సింగభూవిభుని దాడికి నోడి యరాతిసంఘముల్
     వే చని యీరముల్ పొదలు వృక్షచయంబులుదూరమేను