పుట:Andhraveerulupar025958mbp.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గలిగినది. ధర్మ సంరక్షణమునకై రాజ్యము స్థాపించి ప్రజా శాంతి కొఱకు సర్వస్వము ధారపోసి మతమునకు జాతికి జన సముదాయమునకు గల్పతరువువలె నున్న విద్యానగర రాజుల జీవితములు పఠనీయములు. విద్యానగర సామ్రాజ్యము నందలి యాదాయములో జాలభాగము ఆకాలమునం గవులకు, మఠాధిపతులకు, విద్వాంసులకు నుపయోగింపబడు చుండెడిది. ప్రతిపౌరుడు సామ్రాజ్య రక్షణమును గృహకృత్యముగా భావించు చుండువారు.

రాజన బ్రజలకు సేవకుడు. ప్రజాసౌఖ్యముల కాతడుత్తరవాది. సమస్త ధర్మముల నాచారణములో బెట్టి దేశమును సత్పథమున నడపుటకు రాజె బాధ్యుడు. ఇట్టి బాధ్యతల గురుతెఱింగి రాజ్యస్థాపనమునందు గాక రాజ్యాభ్యుదయ కాలమున గూడ స్వధర్మము మఱువని హరిహరరాయ బుక్కరాయల జీవితము అనంతరము విద్యా నగరరాజ్యము ఏలిన నృపులందఱకు నాదర్శప్రాయముగ బరిణమించెనేని పరాధీనత ఆంధ్రులకు దటస్థించునదికాదు. విద్వాంసులు సామ్రాజ్యాభ్యుదయమునకు బాటుపడుటయు సన్యాస స్వీకరణానంతరము మఠాధిపతిగా నుండియు దేశమునెడ ననురాగము వహించుటయు విద్యారణ్యుల జీవితమునందు గల పవిత్రాంశములు. మహామహుడగు విద్యారణ్యుని దైవభక్తి