పుట:Andhraveerulupar025958mbp.pdf/124

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

హరిహర రాయలకు బుక్కరాయలకు ఉత్తరవయస్సు నందు మాధవమంత్రియను మఱియొక విద్వాంసుడు విద్యానగర సామ్రాజ్య ధూర్వహుడై మంత్రి పదవి యందుండి మిగుల బేరొందెను. కొందఱు మాధవవిద్యారణ్యులు మాధవమంత్రి యొకడని తలంచుట భ్రాంతిమూలము. ఇరువుర గోత్రము, తలిదండ్రుల పేరులు చూచిన వేఱువేఱు పురుషులని స్పష్టముగా దెలియుచున్నది. మాధవమంత్రి గీర్వాణము నందు బెక్కు గ్రంథముల రచించెను. నాస్తిక మతమును ఖండించెను. బుక్కరాయల ప్రభుత్వకాలమున నీతడు పశ్చిమదిశ కధిపతిగానుండి విరోధిరాజులకు వీరస్వర్గము ప్రసాదించు చుండెను. ఈ వీరుడు గోవాపట్టణమును జయించి యందు బాదుకొనియున్న మహమ్మదీయులను బోదోలి యాదవుల కారాజ్యము ప్రసాదించెను. ఈయన జీవిత చరిత్రము నింకను దెలిసికొనవలసి యున్నది. ఇంక నెందఱు స్వార్థత్యాగు లీ సామ్రాజ్య సహాయులైరో యెఱుంగనయితికాదు. విద్యారణ్యులవారు మకుటములేని చక్రవర్తియై విద్యానగర రాజ్యమును సర్వవిధముల నభ్యున్నతికి దెచ్చెను. ఆకాలమున గేవల విద్యావినోదములతో గాక సంగర రంగములతో గాలయాపనము జేసిన మాధవమంత్రి, సాయణాచార్యులు, సాళ్వమంగు, గోపప్రధాని యొనరొంచిన మహత్తర సేవవలనను వైదికమత మింతవఱకు మనదేశమున నిలుచుట కవకాశము