పుట:Andhraveerulupar025958mbp.pdf/115

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కారులగు నలువురు సోదరులను నాలుగుచోటుల శాంతిస్థాపనమునకు బంపుచు విద్యారణ్యుల సహాయమున దుర్గములను గోటలను బలపరచుచు జిరకాలము రామరాజ్యమువలె హరిహరరాయలు పాలించుచుండెను. క్రమముగా గర్ణాటదేశము, ద్రవిడదేశములోని కొన్నిభాగములు సముద్రప్రాంతములు వనవాసి, మహిశూరు లోనగు రాజ్యములన్నియు హరిహరరాయల పరిపాలనములోనికి వచ్చెను. విశాలమగు తనరాజ్యమున బ్రజాసుఖమె తన సుఖముగా భావించి అవసరమగు తావులకు దన సోదరుల బంపి ప్రజాసౌఖ్యములు విచారించుచు హరిహరుదు రాజ్యము ధర్మబద్ధముగా బాలించెను.

కర్ణాటరాజ్య మీవిధముగా దినదినాభివృద్ధియగుచుండగనే ధూమకేతువు వలె బహమనీరాజ్యమొకటి స్థాపింప బడెను. డిల్లీచక్రవర్తియొద్ద సేనానాయకుడుగా నున్న హసన్ గంగూ అను మహమ్మదీయుడు అల్లా ఉద్దీను షాహ అను బిరుదనామముతో నీనూతన రాజ్యమును క్రీ.శ. 1347 లో దక్షిణాపధమునందు (డక్కన్ దేశమున) నెలకొల్పి క్రమముగా నభివృద్ధికి దెచ్చుచుండెను. మహమ్మదీయులు ముందునకు వచ్చి విజయనగర రాజ్యమును గూడ గబళింప దీవ్రకృషి చేయుచుండిరి. విజయనగరాధిపతి తన బలములో విశేషభాగమును సరిహద్దులలోనుంచి తురకలను రాజ్యమునం దడుగైన బెట్టకుండ జేసెను. యవనుల దాడికి లోనుగాక సురక్షి