పుట:Andhraveerulupar025958mbp.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముగానున్న యితర ప్రదేశములకు వెడలిపోయిరి. వెలమవీరుడగు అనపోతానాయకుడు స్వతంత్రరాజ్యము స్థాపించెను గాని సరియగు దుర్గములు, విశ్వాసపాత్రులగు పరిజనులు లేకపోవుటచే యవనులధాటివలన నారాజ్యముగూడ క్షీణించుచుండెను. ఈపరిస్థితులు గమనించి ఆంధ్రసామ్రాజ్యమునందు సుగంధ భాండాగారాధ్యక్షులగు హరిహరరాయలు, బుక్కరాయలు అను వీరసోదరులు అమితధనసంపత్తితో, వస్తువాహనములతో, బరివారముతో విద్యారణ్య స్వాములవారి ప్రోత్సాహమున స్వతంత్రరాజ్యము స్థాపించుటకు అనుకూల ప్రదేశములు వెదకుచు గొన్నిదినములకు బైనిచెప్పిన ఆనెగొందికిజేరి రాజును లోబఱచికొని తామెరాజుగ రాజ్యము పాలించుచుండిరి. విద్యారణ్యులు నూతన సామ్రాజ్య స్థాపనకు వలయుప్రయత్నములు చేయుచుండెను.

హరిహరరాయలను బుక్కరాయలను వెంటనిడుకొని విద్యారణ్యస్వామి యొకదినంబున నూతన సామ్రాజ్యము స్థాపించుటకు అనుకూలప్రదేశ మెచటనున్నదో వెదకుటకు బయలుదేరెను. కొంతదూరము పోవగా జుట్టును గొండలచే నావరింపబడి సురక్షితమగు నొకవిశాలప్రదేశము తుంగభద్రాతీరమున వారికి గోచరించెను. ఆప్రదేశము మనోహరముగా నుంటచే నందు సంచరించుచు విశేషముల నరయుచునుండ గొన్ని వేటకుక్కలు కుందేళ్లచే దరుమబడి పరుగెత్తుట కన