పుట:Andhraveerulupar025958mbp.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లలో బశుధనమున సోమరాజును బోలిన భూపాలకుండు లేడయ్యెను. గోదావరీతీరమందలి సారవంతములగు నరణ్యములలో గడుపాఱ మేసి సాయంసమయమున లేగలకై యంబాయనియఱచుచు నేతెంచు గోకదంబంబును సోమరాజును నాతని ధర్మపత్నియు మిగుల బ్రేమతో దిలకించుచుందురు. సోమరాజుసతి సిరియాలదేవి. ఈదంపతులు సంతానహీనులగుటచే దమ లేగదూడలనే బిడ్డలుగ భావించి ప్రేమతో నిరంతరము దిలకించువారు. కాలవశమున ననావృష్టి దోషముచే గోదావరి ప్రాంతములయందలి యరణ్యములలో గోకదంబమునకు జాలినంత పచ్చిక లభింపదయ్యెను. పశువుల దు:స్థితికి సోమరాజు మిగుల విచారించి పుత్ర పుత్రికా జననమునకు మాఱుగజూచు తన ప్రేమపాత్రమగు నాలమందలను విధిలేక కందార రాజ్యమునకు సరిహద్దులోనున్న తమ యడవులలో జలము, తృణము సమృద్ధిగా నున్నటుల విని యటకు సాయుధులగు భటులతో గూడ బంపించెను. సోమదేవరాజు నాజ్ఞ శిరసావహించి పశుపరిపాలకు లా గోకదంబమును నహర్నిశలు జాగరూకతో దిలకించుచు దుష్టమృగములవలన నెట్టి యపాయము రాకుండునటుల జూచుచుండిరి. అసూయాసర్పదష్టుడగు కటకేశ్వరుడు సరిహద్దులలో సోమదేవ భూపాలుని గోకదంబ మున్నటుల చారులవలన నెఱింగి సోమరాజును సాధింప నవకాశము లభించినదని మిగుల నానం