పుట:Andhraveerulupar025958mbp.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పరిపాలనమున విచ్ఛిన్నముకాగా వేమారెడ్డి తాను ప్రభుత్వమునకువచ్చి పునరుద్ధరించినటుల అమరావతిశాసనమునందు జెప్పుకొనినాడు.

వేమారెడ్డి గతించినను అతనివంశము నశించినను నేటివఱకు నాతని ధర్మములు శాశ్వతముగా నున్నవి. వేమవరము అను పేరుతో నెన్నియో గ్రామములుకట్టించి వేదవేదాంగ విదులగు బ్రాహ్మణులకు దానముచేసి వైదికమతమును నిలువబెట్టెను. నూటయెనిమిది దేవాలయములు కట్టించి యందీశ్వర ప్రతిష్ఠగావించి, నటులకు గాయకులకు భజనపరులకు అర్చకులకు బుష్కలముగా వృత్తుల నొసంగెను. దుర్గమముగా నున్న శ్రీశైలమునకును అహోబిలమునకును మెట్లుకట్టించి యాత్రికుల కెంతయో సౌకర్యము కలుగజేసెను. విరోధులను రాజ్యపు సరిహద్దులలో నేని అడుగిడ నీయకుండ జాగ్రత్తచేసి ప్రఖ్యాతి నొందెను.

వేమారెడ్డియొద్ద రాజ్యాంగ విదుడును బరిపాలనా కౌశలుడును ధర్మపరాయణుడును నగు కాశ్యపగోత్ర సంజాతుడైన రామాప్రగడయు నతని యనంతర మాతని మనుమడగు మల్లినాథుడును మంత్రులుగానుండి రాజ్యమును మిగుల నభివృద్ధిలోనికి గొనివచ్చిరి. సేనానాయకులుగా సహోదరులగు అన్నారెడ్డియు, మల్లారెడ్డియు, గుమారుడగు అనపోతా రెడ్డియు, మేనమామ కుమారుడగు నూకారెడ్డియునుండి రాజ్యాభి