పుట:Andhraveerulupar025958mbp.pdf/106

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

వారు రాజ్యసంపదల గోలుపోయి పద్మనాయకులధాటికోర్వజాలక యితర ప్రాంతములకు వలసబోయిరి. పద్మనాయకులన బడు వెలమవీరులు ఓరుగల్లు మొదలుకొని కృష్ణవరకు బాలించుచు దరుణముగనిపెట్టి రెడ్డిరాజ్యమును గూడగబళింపవలెనని పలుమాఱు ప్రయత్నించి సరిహద్దులలో భయంకర సంగ్రామము లొనరించి విఫలప్రయత్నులై వెనుకకు మఱలిరి. నాటనుండి రెడ్డివారికి వెలమవారికి జిరకాలము తగవులు, సంగరములు జరుగుచు వచ్చెను. వేమారెడ్డి తన రాజ్యమునం దంతటను రాజప్రతినిధులుగా దన సోదరులను అగ్రజులను, జ్ఞాతులను, మాతామహ కుటుంబమువారిని నుంచి తాను అద్దంకి రాజథానిగా జేసికొని నెల్లూరుమొదలు గోదావరీ మండలమువఱకు బరిపాలించెను. కర్నూలు మండలము గొంత బాగమును, కృష్ణా గుంటూరు మండలములు పూర్తిగను, నెల్లూరి మండలములో జాలభాగమును, గోదావరీ మండలములోని తూర్పు భాగమును వేమారెడ్డి పాలించెనని విశ్వసింపవచ్చును. ఈయన మన్నెరాజులను గూడ గెలిచితినని చెప్పుకొనుటచే గటకమువఱకు దండయాత్రల కేగె ననియు నాప్రాంతము లచిరకాలమునకె పరహస్త గతమై యుండుననియు దలంచవచ్చును. వేమ భూపాలు డార్యధర్మములను నెలకొల్పుటలోను బునరుద్దరించుటయందును మిగుల బేరెన్నిక గాంచెను. ప్రతాపరుద్రదేవుని ధర్మములు ఖిలమై యవన